నలుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
ములకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచార కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజు గురువారం వెల్లడించారు.
ప్రధాన నిందితుడు మల్లారం గ్రామానికి చెందిన శివగా గుర్తించబడగా, అతనికి సహకరించిన మణికంఠ, వేణు, గణేష్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎల్కతుర్తి జంక్షన్ వద్ద పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. అదనంగా, ఈ కేసులో నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.