rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:30 pm Posted by : RAJAMUDRA NEWS

ఎస్ ఐ ఆర్ సద్వినియోగం చేసుకోవాలి…. బీర్కూర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి. విఠల్

బీర్కూర్, రాజముద్ర న్యూస్

 

  1. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు మూలస్తంభమని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలోముందుండాలని బీర్కూర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి. విఠల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రభుత్వం అందిస్తున్న ఎస్‌ఐఆర్ సేవలను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
    ప్రస్తుత కాలంలో చాలా మంది ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్ ద్వారా సులభంగా ఓటరు నమోదు, మార్పులు, సవరణలు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.ప్రతి యువత18 సంవత్సరాలు పూర్తయ్యాక వెంటనే ఓటరు హక్కును నమోదు చేసుకోవాలని, అలాగే ఇప్పటికే ఉన్న ఓటర్లు తమ వివరాలు సరిచూసుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని బీర్కూర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పివిఠల్ సూచించారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.“ఓటు హక్కు మన హక్కే కాదు, అది మన బాధ్యత కూడా” అని పేర్కొంటూ, సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఓటు వినియోగం తప్పనిసరి అని అన్నారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.ఇకపై ప్రతి ఒక్కరు కనీసం నలుగురికి ఓటు నమోదు గురించి అవగాహన కల్పించి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచడం అత్యవసరం అని చెప్పారు.