rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 8:51 am Posted by : RAJAMUDRA NEWS

మిల్లులతో అధికారుల మూలాఖత్…? తీరని సమస్యలు.. పట్టించుకోని అధికారులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఆందోళన చెందుతున్న రైతన్నలు

బాన్సువాడ, రాజముద్ర, న్యూస్:

కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి మద్దతు ధర వస్తుందని ఆశతో కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు వివిధ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకవైపు అధికారులు సమస్యలు లేకుండా అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా అధికారులు సూచిస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. దీంతో ఉమ్మడి బీర్కూరు మండలంలోని ఆయా శాఖల అధికారులు మిల్లుల తో మూలాఖత్ అయ్యారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అదనపుతరుగు విషయంలో రైతుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

రోడ్ ఎక్కుతున్న స్పందించని అధికారులు…
తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు రోడ్డు ఎక్కుతున్న సంబంధిత శాఖ అధికారులు స్పందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టాలని ఒక వైపు జిల్లా అధికారులు సూచిస్తున్న క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయా శాఖల అధికారులు మిల్లులతో ములకత్ కారణమేనని బహిరంగ ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
సమస్య ఏర్పడినప్పుడు హడావిడి…
రైతులు రోడ్డెక్కగానే అక్కడికి చేరుకున్న అధికారులు హడావిడిగా రైతులను సర్ది చెప్పి ధర్నాలను విరమింప చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ధర్నాలు జరగకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవడంలో క్షేత్రస్థాయిలో విప్లమవుతున్నారని విషయం బాహాటంగానే తెలుస్తుంది. ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు పలు మిల్లులతో మొలకత్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తేనే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. మరి అధికారులు పర్యవేక్షించి రైతుల ఇబ్బందులు తీరుస్తారా శిరమాములుగా వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే