rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 12:38 pm Posted by : RAJAMUDRA NEWS

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన బాధితులు

బాన్సువాడ : రాజముద్ర న్యూస్:

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను దళిత నాయకులు కాదేపురం గంగన్న గారి ఆధ్వర్యంలో కంశెట్ పల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం శుక్రవారం కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్బంగా కాదేపురం గంగన్న మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలవగానే చాలా సానుకూలంగా స్పందించారని, వెంటనే బాన్సువాడ డీఎస్పీ గారితో ఫోన్ లో మాట్లాడి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారని తెలిపారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహానికి గురయ్యారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవిధంగా చూస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు కాదేపురం గంగన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీయస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగల్ల శ్రీనివాస్, రొడ్డ వెంకటి, కొండాపూర్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.