రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించాలి
ముల్కనూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన వరంగల్ సీపి సన్ ప్రీత్ సింగ్
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్ ను బుధవారం నాడు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ముల్కనూర్ పోలీసులు సిపికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించాలని, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి గ్రామాల హిస్టరీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సిబ్బంది గ్రామాల పర్యటనను తరచుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపి ప్రశాంత్ రెడ్డి ఎలకతుర్తి సీఐ పులి రమేష్, ఎస్సై రాజు పాల్గొన్నారు.