ముల్కనూర్ ఎస్సై రాజు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

వాహనదారులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ముల్కనూర్ ఎస్సై రాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికా కార్యక్రమం లో భాగంగా డిజిపి శివధర్ రెడ్డి సూచనల మేరకు, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నాలుగో విడత అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ముల్కనూర్ పోలీసుల ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించి గ్రామ పెద్దలతో రోడ్డు భద్రత కమిటిని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు హెల్మెట్లను అందజేశారు. గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని, హెల్మెట్ లేని వాహనదారులను గ్రామంలోకి రానివ్వమని, రోడ్డు భద్రత నియమాలు పాలిస్తామని గ్రామ ప్రజలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని, ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.