rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:24 am Posted by : RAJAMUDRA NEWS

హిందూ ధర్మ సమ్మేళనం ఆహ్వానం

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ ఐక్యత లక్ష్యంగా హిందూ ధర్మ సమ్మేళనం ఈ నెల 20వ తేదీన ముల్కనూర్‌లోని శ్రీ గార్డెన్‌లో నిర్వహించబడనున్నది. ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సమ్మేళనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జ్ఞాన చైతన్యానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే మహిళా వక్తగా ప్రొద్దుటూరి రూప పాల్గొని ప్రసంగించనున్నారు. వారు హిందూ ధర్మం, సంస్కృతి, సమాజ ఐక్యతపై ప్రేరణాత్మక సందేశాలు అందించనున్నారు.

“గడప లోపలే కులం – గడప దాటితే హిందువులం” అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. హిందూ సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం, సామాజిక సమన్వయం పెంపొందించడం ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.

దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజమనే భావనతో సమాజాన్ని చైతన్యవంతం చేసి, సమైక్యంగా నిలబెట్టడం ద్వారా భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలపాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న వివిధ సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.