ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వంగర పీహెచ్‌సీలో అంబేద్కర్ జయంతి వేడుకలు

వంగర పీహెచ్‌సీలో అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

-అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలి 

-డాక్టర్ రెహమాన్ 

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య ప్రాధాన్యతపై అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రుబీన, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ జీవితం, సందేశాలను గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!