rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:54 am Posted by : RAJAMUDRA NEWS

హరితహారానికి గొడ్డలి వేటు… -పక్షులు వాలుతున్నాయనే కారణం చూపి.. -మహా వృక్షాన్ని కొట్టేసిన వైనం -కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు

నసుల్రాబాద్, రాజముద్ర న్యూస్

 

అడవుల శాతం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం హరితహారం పేరుతో అడవుల పెంపకానికి కృషి చేస్తుండగా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. పక్షులు వాలుతున్నాయనే చిన్నపాటి కారణంతో 20ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఆ మహా వృక్షాన్ని కొట్టేశారని పలువురు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో చోటుచేసుకుంది.

 

మా స్థలంలోనే ఉన్న చెట్టును కొట్టేశారు…లాల్సింగ్

మా తండ్రి టాక్రియ నాయక్ గుడి వద్దనే 20ఏళ్ల క్రితం ఉన్నా భారీ వృక్షాన్ని కొందరు పెద్దలు మా పరిధిలో ఇది లేదంటూ.. కక్ష్య పూరితంగా కొట్టేశారని లాల్సింగ్ ఆరోపించారు. తండాలోని గుడికి మా స్థలం కావాలని అడిగితే మా నాన్న గుడి స్థలం వదిలి మేము భూమిని కొంత అమ్మామన్నారు. రెండు దశాబ్దాలుగా ఉన్న మహా వృక్షాన్ని కొందరు మా పరిధిలో లేదంటూ అకారణంగా కొట్టేశారని లాల్ సింగ్ ఆరోపించారు.

 

వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు…

అంకోల్ తండాకు చెందిన ఎం.సంజీవ్ అనే వ్యక్తి ఊరి పెద్దలు చెబితే మహా వృక్షాన్ని కొట్టేసినట్లు తెలిసిందన్నారు. కొంగల కూర్చుంటున్నాయనే కారణంతో కొట్టేశారని పెద్దలు తెలుతున్నారన్నారు. మహా వృక్షాన్ని కొట్టివేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్వో, ఎఫ్ఆర్వో, కార్యదర్శులకు ఈ విషయమై తాము చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని మలోవత్ లాల్ సింగ్ తెలిపారు.