rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:34 pm Posted by : RAJAMUDRA NEWS

అభి ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి

బాన్సువాడ , రాజముద్ర న్యూస్:

 

అనుమతులు లేకుండా 9 10వ తరగతిలో నిర్వహిస్తున్న అభి పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బి.ఆర్.ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండల కేంద్రం లో ఉన్న అభి ఇంటర్నేషనల్ స్కూల్ లో 9 10వ తరగతి క్లాస్లకు పర్మిషన్ లేకున్నా తరగతులను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వీఆర్ఎస్ నాయకులు విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ విద్యార్థుల నుండి అధిక పీజులు వసూలు చేస్తూ విద్య శాఖ అధికారుల ఆదేశాలు పక్కన పెట్టి చట్టానికి విరుద్దంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల పిల్లల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభి ఇంటర్నేషనల్ స్కూల్ లోకి వెళ్లి స్థానిక స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడితే ఇక్కడ 9, 10 వ తరగతిలు జరగడం లేదని చెప్పగా , పరిశీలనలో స్కూల్ లో ఉన్న క్లాస్ రూమ్ ను పరిశీలించగా అక్కడ నిజంగానే క్లాస్ లు జరుగుతున్నాయ. న్నారు కావున స్థానిక ఆర్ఐ ద్వారా 9, 10వ క్లాస్ రూమ్లను సిజ్ చేయడం జరిగింది అభి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యం విద్యార్థుల తల్లి దండ్రుల తో దురుసుగా మాట్లాడితే స్కూల్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా. బీఆర్ఎస్ పార్టీ నసురులాబాద్ సీనియర్ నాయకులు గోడిసేలా నర్సిములు టేకుర్ల సాయిలు.మైలారం మాజీ సర్పంచ్ మహేందర్. నచుపల్లి ఉప సర్పంచ్ శంకర్. దొంతి భాస్కర్.పిట్ల కుమార్. భూమయ్య. వడ్ల భాస్కర్. లక్ష్మణ్.నాగరాజు. గంగారాం. కనుక్కుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.