rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:50 pm Posted by : RAJAMUDRA NEWS

గ్రామాల్లో కల్లు లొల్లి… -దుకాణాలకు తాళాలు

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

 

కామారెడ్డి జిల్లా ఉమ్మడి బీర్కూరు మండలంలోని పలు గ్రామాల్లో కల్లు లొల్లి కొనసాగుతుంది. దీంతో ఆయా గ్రామాల్లో దుకాణాలకు ప్రజలు తాళాలు వేసి నిరసన తెలుపుతున్న ఘటనలు నిత్యం ఏదో ఒక గ్రామంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది.

తాజాగా కొన్ని ఘటనలు…

నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్లో గ్రామస్థులు కల్లు దుకాణానికి తాళం వేసి నిరసన తెలిపారు.
అదేవిధంగా బీర్కూరు మండలంలోని కిష్టాపూర్ వీరాపూర్ గ్రామాల్లో సైతం ప్రజలు కల్లు ధర పెంపు విషయంలో నిరసన తెలిపారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రస్తుతం కల్లు లొల్లి నడుస్తుంది.

ధర పెంచడం ఒక కారణం..!

కల్లు ధరను వ్యాపారస్థులు ఒక్కసారిగా పెంచడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సీసా ధరను రూ. 10 నుంచి రూ.15కు పెంచారు. దీంతో గ్రామస్థులు ఏకమై కల్లు దుకాణాన్ని మూసివేసి తాళాలు వేస్తున్నారు. పాత ధరకే కల్లు అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు అమ్మకాలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు పర్యవేక్షిస్తే పలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.