rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 7:55 pm Posted by : RAJAMUDRA NEWS

జుక్కల్ పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

జుక్కల్ ,రాజముద్ర న్యూస్:

 

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సోమవారం జుక్కల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని రికార్డులు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, సీసీటీ ఎన్ ఎస్ పనితీరు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా మాట్లాడి వారి విధుల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఎదురైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహిస్తూ, క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రతిరోజూ నిర్వహించే రోల్‌కాల్‌లో సిబ్బందికి విధుల నిర్వహణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. రోల్‌కాల్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలని సూచించారు.ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్, లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.నేరాల నియంత్రణలో భాగంగా బీట్ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేయాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని తెలిపారు. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు పోలీసుల ఉనికి కనిపించేలా విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. ప్రజలకు ప్రజలకు అవసరమగు విషయాలలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సమన్వయంతో పనిచేస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెంట బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, జుక్కల్ ఎస్‌ఐ మురళి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.