నస్రుల్లాబాద్, రాజముద్ర న్యూస్:
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ విట్టల్ రెడ్డి వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు.పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన డీఎస్పీ విట్టల్ రెడ్డి, కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ ఎస్సై సాయి కృష్ణతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.