rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 8:54 pm Posted by : RAJAMUDRA NEWS

బైక్ దొంగతనాలకు చెక్…, నిందితులకు ఏడాది జైలు శిక్ష

కామారెడ్డి, రాజముద్ర న్యూస్:

 

 

కామారెడ్డిపట్టణంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మోటార్ సైకిల్ దొంగతనాలపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులునమోదయ్యాయి.22.03.2026న రాత్రి 8:30 గంటల సమయంలో కమ్మరి రాకేష్ తనకు చెందిన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను కామారెడ్డి పట్టణంలోని భవానీ నగర్ కాలనీలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం ఎదుట పార్క్ చేసి లోపలికి వెళ్లారు. తిరిగి రాత్రి 9:20 గంటలకు వచ్చి చూడగా మోటార్ సైకిల్ కనిపించలేదు. దీంతో 23.03.2026న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.అదేవిధంగా, అదే రోజు కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పార్క్ చేసిన ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. వాహనం కోసం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.ఈ రెండు కేసుల్లో దర్యాప్తు చేపట్టిన కామారెడ్డి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి మట్టె అచ్యుత్ @ అచ్యుత్ రెడ్డి, కొక్కు గణేష్‌లను నిందితులుగా గుర్తించారు.ఈ కేసుల విచారణలో నేరం రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారి ఎస్‌ఐ సాయికృష్ణ సేకరించి, పకడ్బందీగా రెండు కేసుల్లోనూ అభియోగపత్రాలు (చార్జిషీట్లు) దాఖలు చేశారు. అనంతరం నిందితులు తాము చేసిన నేరాలను గౌరవ న్యాయస్థానం ఎదుట అంగీకరించారు.ఈ క్రమంలో కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బండారి శ్రీలత 19.11.2026న రెండు కేసుల్లోనూ ఇద్దరు నిందితులకు ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు రూ.100 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.ఈ కేసుల్లో ప్రభుత్వ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. రజని, దర్యాప్తు నిర్వహించిన ఎస్‌ఐ సాయికృష్ణ, కోర్టు లైజనింగ్ అధికారి ఏఎస్సై పండరి గౌడ్, కోర్టు సీడీవో బి. ప్రకాష్, ప్రస్తుత కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరిలను జిల్లా ఎస్పీఅభినందించారు.