rajamudranews.com
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 4:56 pm Posted by : RAJAMUDRA NEWS

శ్రీవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

 

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో కొలువుదీరిన తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ సదుపాయాలపై కలెక్టర్ ఆరా!
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, అందుబాటులో ఉన్న వసతులు, నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీ సభ్యులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎంతో ఇష్టమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విధానం, తయారీకి వినియోగించే పదార్థాలు, తయారీ ప్రక్రియ, పంపిణీ విధానం గురించి ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు.
ఆలయ నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సేవలపై అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, పాల్గొన్నారు.