పొతంగల్, రాజముద్ర న్యూస్
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగార్గ గ్రామానికి చెందిన జవాన్ గొడుగు గంగాధర్ రిటైర్మెంట్ కార్యక్రమం యువకులు ఘనంగా నిర్వహించారు. సైన్యంలో సేవలందించి దేశానికి విశేష సేవలు చేసిన గంగాధర్‌కు గ్రామ యువకులు, ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి,పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆయనకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన భగవద్గీత పుస్తకాన్ని అందజేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు గంగాధర్ చేసిన సేవలను ప్రశంసిస్తూ, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షులు డాక్టర్ సీతాలే రమేష్ మాట్లాడుతూ,….. దేశ సేవలో గంగాధర్ చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. సైన్యంలో పనిచేసిన వారికి సమాజంలో ప్రత్యేక గౌరవం ఉండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు మేత్రి కిరణ్, విశ్వనాథ్, మహేష్, అనిల్, సాయిలు యువకులు, తదితరులు పాల్గొన్నారు.
