ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణబీర్కూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ...

బీర్కూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. -దేశాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం గౌరవ అధ్యక్షులు కొప్పుల గంగాధర్

📰 Generate e-Paper Clip

బీర్కూర్: రాజముద్ర న్యూస్

 

బీర్కూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దుర్గం సాయిలు మాట్లాడుతూ….. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో జర్నలిస్టులు, ప్రజలు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.వేడుకల్లో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు కొప్పుల గంగాధర్ ఉపాధ్యక్షులు కే నారాయణ, గాంధీ, ప్రధాన కార్యదర్శి పుల్లేని విఠల్, సెక్రటరీ అశోక్, కోశాధికారి పుల్లేని సునీల్, సభ్యులు ఎం నగేష్, ఎన్. శ్రీనివాస్, కె. శ్రీకృష్ణ, ఎస్. బాలకృష్ణ , స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి, ఐక్యత, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!