కామారెడ్డ, రాజముద్ర న్యూస్
కామారెడ్డి జిల్లా లోని పద్మాజీ వాడి ఎక్స్ రోడ్లో గల శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా చిన్నారులు కృష్ణుడు, గొల్ల బామ, రుక్ముణి, రాధ వేశాలలో నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. ఉట్టికొట్టి సంబురాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
