ePaper
Thursday, November 12, 2026
📄 ePaper
Homeతెలంగాణరబీ పంటలకు సాగునీటిని అందించాలి

రబీ పంటలకు సాగునీటిని అందించాలి

📰 Generate e-Paper Clip

వర్ని, రాజముద్ర న్యూస్:

మా ప్రాంతం మెట్ట పైర్లకు అనుకూలం కాదు, వరికే సహకరించాలని రైతుల డిమాండ్ చేశారు.నిజాంసాగర్ లో నీటిపై స్పష్టత ఇవ్వాలని వర్ని రైతు వేదికలో డిమాండ్ ఎల్ నినో ప్రభావంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రస్తుతం వరి పంటలు సాగు చేయవద్దని చెప్పడంతో నిజామాబాద్ జిల్లా వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన రైతులు వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వరి పంటలు వేయొద్దు, మెట్ట పంటలు మాత్రమే వేసుకోండని చెబుతుందని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మెట్ట పైర్లు వేయడానికి అనుకూలంగా ఉన్నాయని, తమ ప్రాంతం మెట్ట పైర్లు వేయడానికి అనుకూలం కాదన్నారు. వరి పంటలు వేసేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారని తెలిపారు. నిజాంసాగర్ లో ఉన్న 9 టీఎంసీల నీటిని తాగడానికి ఎన్ని టీఎంసీలు ఉపయోగిస్తారు, రైతులకు పంటకు ఎన్ని టీఎంసీల నీటిని అందజేస్తారన్నది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రైతుల సాగుకు అందించే విద్యుత్తు సమస్యపై మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఎన్ని గంటలు విద్యుత్తు అందజేస్తుందో తెలియజేయాలని కోరారు. ఎరువులను యాప్ ల ద్వారా కాకుండా పట్టా పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు చూసి దాని ద్వారా ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు. ఈ సమావేశంలో ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!