ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రజాసేవకు ప్రతిరూపం... నాయకత్వానికి చిరునామా పోచారం భాస్కర్ రెడ్డి

ప్రజాసేవకు ప్రతిరూపం… నాయకత్వానికి చిరునామా పోచారం భాస్కర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, రాజముద్ర న్యూస్

ఉమ్మడినిజామాబాద్ జిల్లా రాజకీయ, సహకార రంగాల్లో తనదైన ముద్ర వేసి, ప్రజలఅభిమానాన్ని చూరగొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అభిమానులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, రైతులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాయకత్వం అంటే పదవి కాదు… ప్రజలకు అండగా నిలవడమే అనే భావనతో ప్రజా జీవితాన్ని కొనసాగించిన వ్యక్తిగా పోచారం భాస్కర్ రెడ్డి గుర్తింపు పొందారు. రైతుల సంక్షేమం, సహకార రంగ అభివృద్ధి, గ్రామీణ ప్రగతి కోసం ఆయన చేసిన కృషిని జిల్లావాసులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.
ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే నాయకుడిగా ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, సేవాభావంతో ముందుకు సాగుతూ ఎన్నో మందికి స్ఫూర్తిగానిలిచారని అభిమానులు కొనియాడుతున్నారు.పదవులు వచ్చినా, పరిస్థితులు మారినా ప్రజలతో ఉన్నఅనుబంధాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ముందుకు సాగిన నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి అని ఆయన అనుచరులు గర్వంగా చెబుతున్నారు. ఆయన చిరునవ్వు, సరళత, అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం ఆయనకు విశేష ప్రజాదరణ తీసుకొచ్చాయని పేర్కొంటున్నారు.
జన్మదినం సందర్భంగా ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరెన్నో విజయాలు కలగాలని, ప్రజాసేవలో మరింత కాలం తన అనుభవాన్ని సమాజానికి అందించాలని వేలాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
“పదవులు శాశ్వతం కావు… కానీ ప్రజల ప్రేమ, సేవతో సంపాదించిన గౌరవం శాశ్వతం. అలాంటి గౌరవాన్ని సొంతం చేసుకున్న నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డికిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!