ePaper
Sunday, October 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవైభవంగా కుంకుమార్చన

వైభవంగా కుంకుమార్చన

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అమ్మ భవాని మాత కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమార్చనతో భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.
కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజాకార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి పట్ల భక్తులు తమకున్న విశ్వాసాన్ని చాటుకుంటూ పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!