బీర్కూర్, రాజముద్ర న్యూస్:
దేశ ప్రజల ఓటు హక్కును హరించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను పార్లమెంటులో అభిశంసన తీర్మానం చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీర్కూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. “బీజేపీ డౌన్ డౌన్.. సీఈసీ రాజీనామా చేయాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మేరకు మాజీ ఎంపీపీ రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ లు మాట్లాడారు. దేశంలో ఓటు హక్కు ఉన్నవారు, లేనివారు అంటూ రెండు వర్గాలను సృష్టించే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, నాయకులు యం. విటల్, ఆవారి గంగారం, ఇ. శంకర్, లక్ష్మీనారాయణ, హమీద్, కు తదితరులు పాల్గొన్నారు.
