ePaper
Monday, November 16, 2026
📄 ePaper
Homeతెలంగాణరబీ పంటలకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి: ఎం. శ్రీనివాసరావు

రబీ పంటలకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి: ఎం. శ్రీనివాసరావు

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, రాజముద్ర న్యూస్:

నిజాంసాగర్‌లో నీళ్లు నిండుగా ఉన్నందున రబీ పంటలకు నిజాంసాగర్ బి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్ రావు అన్నారు. రబీ పంటలు వెయ్యవద్దని ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడాన్ని నిరసిస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రైతులు గళమెత్తారు. భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ నేత మోరల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మోరల్ శ్రీనివాసరావు ఇంటి వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 9.1 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇంత నీరు ఉండగా రైతులను పంట వేయొద్దనడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు. రైతు పండిస్తేనే అందరూ తింటారని, రైతుకే హాలిడే ఇస్తే పరిస్థితి ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం నాయకులు, రైతులు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి, స్థానిక ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. నిజాంసాగర్ నుంచి వెంటనే పంట పొలాలకు నీరు విడుదల చేయాలని, క్రాప్ హాలిడేను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, మోచి గణేష్, హకీం, ఖాదర్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!