ePaper
Sunday, November 15, 2026
📄 ePaper
Homeతెలంగాణబీర్కూర్ మండలానికి 393 కొత్త పెన్షన్లు మంజూరు

బీర్కూర్ మండలానికి 393 కొత్త పెన్షన్లు మంజూరు

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

 

బీర్కూర్ మండలానికి కొత్తగా 393 చేయూత పెన్షన్లు మంజూరైనట్లు ఎంపీడీఓ మహబూబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై తన చేతుల మీదుగా 393 మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మండలానికి కొత్తగా 393 పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమానికి అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!