బీర్కూర్, రాజముద్ర న్యూస్
ప్రతి ఒక్కరు ఎస్‌ఐఆర్అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్యానికి తోడ్పడాలని బీర్కూర్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి. విఠల్ సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన ముఖ్యమైన రాజ్యాంగ హక్కు అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,….. యువత ముందుకు వచ్చి తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు పొందాలని కోరారు. ఓటు హక్కు వినియోగం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని, ప్రజాస్వామ్యాన్ని బలపరచవచ్చని తెలిపారు.అలాగే, ఇతరులకు కూడా అవగాహన కల్పించి నలుగురికిఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి ఓటు విలువైనదని, అది దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగి ఉందని అన్నారు.
