ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

📰 Generate e-Paper Clip

ప్రగాఢ సానుభూతి తెలిపిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంటింజెన్సీ వర్కర్ గా సుమారు 20 సంవత్సరాలుగా సేవలందించిన వేముల తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హనుమకొండ జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అప్పయ్య వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందంతో తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున రూ. 1,04,203/- ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని విధాలుగా తమ సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!