ePaper
Thursday, April 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎల్కతుర్తి జంక్షన్ వద్ద పట్టుబడ్డ అత్యాచార కేసు నిందితులు

ఎల్కతుర్తి జంక్షన్ వద్ద పట్టుబడ్డ అత్యాచార కేసు నిందితులు

📰 Generate e-Paper Clip

నలుగురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:

ములకనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచార కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజు గురువారం వెల్లడించారు.

ప్రధాన నిందితుడు మల్లారం గ్రామానికి చెందిన శివగా గుర్తించబడగా, అతనికి సహకరించిన మణికంఠ, వేణు, గణేష్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎల్కతుర్తి జంక్షన్ వద్ద పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. అదనంగా, ఈ కేసులో నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!