బీర్కూర్, రాజముద్ర న్యూస్:
బీర్కూర్ మండల కేంద్రం కామప్ప చౌరస్తా లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చారు. కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీర్కూర్ ఎస్సై రాములు ముఖ్య అతిథిగా హాజరై, హెల్మెట్ వినియోగం ప్రాణాలను కాపాడుతుందని ప్రజలకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాములు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి హెల్మెట్లు పంపిణీ చేసి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేకల విట్టల్, కొరిమి రఘు, పృద్వి గౌడ్, అశోక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
