బీర్కూర్, రాజముద్ర, న్యూస్:
బోధన్‌లోని ఏక చక్రేశ్వర గోశాలలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.15 వేల విలువైన పశుగ్రాసం కాలిపోవడంతో గోశాలనిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గోశాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపగా, పశువుల పోషణపై సందిగ్ధత నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు పిట్లం అశోక్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. గోశాల పరిస్థితిని అర్థం చేసుకుని, రూ.25 వేల విలువ చేసే సుమారు 350 పశుగ్రాస కట్టలను గోశాలకు పంపిణీ చేశారు. ఈ సహాయం గోశాలకు ఊరట కలిగించడమే కాకుండా, పశువుల సంరక్షణకుమద్దతుగా నిలిచింది.ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ, పిట్లం అశోక్ చేసిన సహాయం అత్యంత సమయోచితమని పేర్కొన్నారు. ఆయనలాంటి దాతలు సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు. స్థానికులు కూడా అశోక్ సేవలను కొనియాడుతూ, ఆయన మానవతా హృదయాన్ని అభినందించారు.
ఈ ఘటన మనిషిలోని మనసును, సహానుభూతిని ప్రతిబింబిస్తూ, అవసర సమయంలో చేయూత అందించడమే నిజమైన సేవ అని మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో మియాపూర్ శశికాంత్, డాక్టర్ సితాలే రమేష్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్, గ్రామ యువకులు , తదితరులు పాల్గొన్నారు.
