ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణసామరస్య వాతావరణంలో బక్రీద్ జరుపు కోవాలి. - ఎస్సై రాములు

సామరస్య వాతావరణంలో బక్రీద్ జరుపు కోవాలి. – ఎస్సై రాములు

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

బక్రీద్ పండుగను శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని బీర్కూర్ ఎస్సై రాములు ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ అనేది ఆనందం పంచుకునే సందర్భమని, ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సహనం పాటిస్తూ సోదరభావంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..,., పండుగ రోజుల్లో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అపోహలు, వదంతులను నమ్మకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.అదేవిధంగా, అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకుసమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో ఐక్యతపెరుగుతుందని ఎస్సై రాములు తెలిపారు.ప్రతి ఒక్కరూకలిసికట్టుగా ఉంటేనే పండుగకు నిజమైన అర్థం ఉంటుందని, బక్రీద్ పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!