ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeతెలంగాణజోరుగా పేకాట స్థావరాలు.. ...

జోరుగా పేకాట స్థావరాలు.. ఆలస్యానికి కారణాలేంటి..?

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

 

 

బీర్కూర్ మండలంలో జోరుగా పేకాట స్థావరాలు కొనసాగుతున్నాయి. పోలీసు అధికారులు సైతం తమకు అందిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడులు చేసి కేసులు సైతం నమోదు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మండలంలో పేకాటను పూర్తిగా నియంత్రించడంలో పోలీస్ శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆలస్యంగా సమాచారం…

బీర్కూర్ మండలంలో జరిగిన క్రైమ్ వివరాలను ఎక్కువ సమయాల్లో పోలీసులు ఆలస్యంగా అందచేస్తున్నారు. ప్రమాదాలు, హత్యలు, గుర్తు తెలియని మృతదేహాలు సమయాల్లో వివరాలు సైతం పోలీసులకు తీసుకోవడంలో సమయం పడుతుంది. కానీ పేకాట స్థావరాలపై జరిగిన దాడులు, ఇతర చిన్న క్రైమ్ వివరాలను సైతం బీర్కూరు మండల పోలీసులు చాలా సమయాల్లో పత్రికా విలేకరులకు సమాచారం అందించడంలో చాలా ఆలస్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారి తీరుపై బహిరంగ విమర్శలు సైతం వస్తున్నాయి.

పేకాటలో ఓ రిపోర్టర్..?

బీర్కూరు లో పేకాట స్థావరంలో ఓ రిపోర్టర్ సైతం ఉన్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని రాజముద్ర దిన పత్రికల్లో కథనం ప్రచురించింది. ఈ విషయమై బీర్కూర్ ఎస్సై రాములను వివరణ కోరగా… మేము పేకాట స్థావరంపై దాడి చేసిన సమయంలో ముగ్గురు దొరికారని, విచారణ చేయగా మరో ఇద్దరు పేర్లను కలిపి ఐదుగురి పై కేసు నమోదు చేశామన్నారు. అక్కడ రిపోర్టర్ ఎవరూ లేరని ఎస్ఐ వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!