బీర్కూర్, రాజముద్ర న్యూస్:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో జోరుగా పేకాట కొనసాగుతుంది. నమ్మదగిన సమాచారం మేరకు బీర్కూర్ లో పోలీసులు దాడులు చేసి పేకాటరాయుళ్ల ను అరెస్టు చేశారు. పేకాట ఆడిన వారితో పాటు దాడిలో పోలీసులు 14,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని, ఐదుగురి పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు.. ఇంతవరకు బాగానే ఉన్నా… ఈ పేకాట ఆడే స్థలంలో ఓ రిపోర్టర్ సైతం ఉన్నాడని.., అతన్ని పోలీసులు పక్కకు తప్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. మండలం లో పేకాట స్థావరాలు కొనసాగుతుయన్న ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. పేకాట వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండటంతో, ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
