ePaper
Thursday, October 8, 2026
📄 ePaper
Homeతెలంగాణసొంతింటి కల నెరవేర్చిందుకు కృషి సర్పంచ్ బోయిని శంకర్

సొంతింటి కల నెరవేర్చిందుకు కృషి సర్పంచ్ బోయిని శంకర్

📰 Generate e-Paper Clip

బీర్కూర్, రాజముద్ర న్యూస్:

 

అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ సర్పంచ్ బోయిని శంకర్ అన్నారు. మంగళవారం గ్రామ సర్పంచ్ శంకర్ ఐదు లక్షలతో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, అర్హులందరికి రూ.5 లక్షల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని మాటిచ్చిందన్నారు . ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకుంటోందన్నారు. కేవలం మూడు నెలల్లోనే పనులన్నీ పూర్తి చేసి 400 చదరపు ఫీట్లలో ఆధునిక సాంకేతికతో ఫిల్లర్ రూఫింగ్ విధానంలో స్లాబ్ నిర్మాణంతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందన్నారు. అదేవిధంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని శంకర్ , ఉపసర్పంచ్ ఇ.శంకర్ , ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకుడు బాబన్న, బోయిని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!