Bheemadevarapally, Mulkanoor: ముల్కనూర్ లో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించిన గన్ను శ్రీనివాస్ దంపతులు
సీతారాముల విగ్రహాలను అందజేసిన ఊసకోయిల ప్రకాష్ దంపతులు
ముల్కనూర్ లో వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించిన గన్ను శ్రీనివాస్ దంపతులు
సీతారాముల విగ్రహాలను అందజేసిన ఊసకోయిల ప్రకాష్ దంపతులు
భీమదేవరపల్లి, రాజముద్ర డెస్క్:
శ్రీ రామనవమి( Sri Rama Navami) పురస్కరించుకొని ముల్కనూర్ (Mulkanoor) గ్రామంలోని సాంబమూర్తి దేవాలయంలో (Sambamurthi Temple) అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణం ( Sitha Rama kalyanam) మహోత్సవం వేద బ్రాహ్మణ పండితుల మధ్య భక్తుల జయ జయ ధ్వనుల మధ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ను శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల విగ్రహాలను ఊసకోయిల ప్రకాష్ దంపతులు దేవాలయానికి అందజేశారు. ఈ కళ్యాణ వేడుకలు చూసేందుకు ముల్కనూర్ ప్రజలు తండోప తండాలుగా విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. తదనంతర అన్నదానాన్ని స్వీకరించారు. వేసవి కావడంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీరామ నామ జపంతో అంతా రామ మయంగా ఆ ప్రదేశమంతా మారింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి దంపతులు, మాజీ జెడ్పిటిసి వంగ రవి దంపతులు, మాజీ ఎంపీపీ కోడూరు సరోజన, మాజీ సర్పంచ్ మంగ రామచంద్రం, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

