Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
మాజీమంత్రి ఈటెల రాజేందర్, కార్పొరేటర్ పవన్ కుమార్
On

కొత్తపేట, మార్చి8, రాజముద్ర న్యూస్:
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తపేట డివిజన్ శివగంగా కాలనీ శివాలయాన్ని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ లు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. వారితో పాటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆ పరమ శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఆంబాల మల్లేష్ , సుబ్బారావు, వెంకట రాముడు, ఆంజనేయులు, నాయకులు కొత్త తిరుమల, మహేందర్ యాదవ్, భీమ్ రాజ్, వెంకట్ రెడ్డి, శివ నేత, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Views: 8
Tags:
About The Author
Related Posts
Latest News
20 Feb 2025 17:33:40
Bheema Devarapalli: క్రేన్ కూలి వ్యక్తి మృతి భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్ : బతుకు తెరువు కోసం నల్గొండ నుంచి వలస వచ్చిన వ్యక్తి క్రేన్ కూలి...