Youth Depression : యువతలో కలత - అంధకారంలో భవిత

యువతలో కలత - అంధకారంలో భవిత
యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి,డిప్రెషన్, అత్మ స్థైర్యం కోల్పోయి భవిష్యత్తూ పై అనిశ్ఛితి తో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్న యువత"
అనంతపురం, రాజముద్ర న్యూస్ :
ప్రపంచ జనాభాలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం, మొత్తం జనాభాలో 50% పైగా జనాభా యువతే, యువతే దేశానికి బలం, దేశాభివృద్ధిలో కీలక పాత్ర యువతదే, అలాంటి యువత నేడు అనేక సవాళ్లను ఎదురుకుంటుంది , దేశం విజ్ఞాన, సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినా మానసిక ఒత్తిడులు, నిరాశ, ఒంటరితనం పెరుగుతూనే ఉన్నాయి ,మానసిక ఒత్తిడుల మూలంగా డిప్రెషన్ కి లోనై క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకొని అయినవారికి, ఆత్మీయులకు జీవితాంతం మానసిక క్షోభను మిగిలిస్తున్నారు .
ప్రపంచంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భారతదేశంలోనే ఆత్మహత్యల జరుతున్నాయి, ప్రతిరోజూ సరాసరినా 160మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అందులో 28 మంది విద్యార్థులె వుండడం ఇంకా బాధాకరమైన విషయం , ఒక్క 2022 సంవత్సరంలోనే 1.7లక్షల మంది భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు అంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు ,గత సంవత్సరం 13,000 మంది విద్యార్థులు వివిధ కారణాతో ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది, తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం
*యువతలో మానసిక ఒత్తిడి, డిఫ్రిషన్, నిరాశ కి ముఖ్య కారణాలు:*
- పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఒకరు
- ప్రేమలో విఫలమయ్యామని మరొకరు
- ఆర్ధిక సమస్యలతో ఇంకొకరు
- తల్లిదండ్రులు తిట్టారని కొందరు
- అనుకున్నది సాధించలేక పోతున్నామని మరికొందరు
- ఉద్యోగంలో ఒత్తిడి అని ఎందరో
- మాదక ద్రవ్యాల మత్తులో మరెందరో....!
ఇలా సమస్య ఏదైనా వాటిని ఎదుర్కోలేక రోజు ఎక్కడో అక్కడ ఏవరో ఒకరు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు..
తల్లిదండ్రులు పిల్లులకు చిన్నతనం నుండే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించలేక పోవడం, వారి ఆశలను పిల్లలపై రుద్దడం, పక్క వారితో పోల్చడం వంటివి పిల్లలను వారికి తెలియకుండానే ఒత్తిడికి గురిచేసి, వారిని డిప్రెషన్ వైపు మళ్లిస్తున్నాయి..
- విద్యాలయాల్లో పిల్లలకు విలువలుతో కూడిన విద్య బోధనలు అందించక పోవడం, మార్కుల వేటలో చదువల ఒత్తిడిలొ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపక పోవడం, పుస్తకాల్లో సమస్యలతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను అత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కోవాలో అత్మ స్థైర్యం తో ఎలా జీవించాలో నేర్పలేక పోవడం..
- పెరుగుతున్న పోటీ, కలుషుతమవుతున్న మానవ సంబంధాలు కూడా ఒక కారణం..
- సామాజిక మాధ్యమాల మీద నియతృణ లేకపోవడం, పెరుగుతున్న సాంకేతికత మంచితో పాటూ చెడును కూడ సమాజానికి చూపిస్తుంది, దురదృష్టవశాత్తు యువత ఆ చేడుకే బానిసలుగా మారి చివరికి జీవితాన్నీ కోల్పోతున్నారు.
పాఠశాల విద్యార్థుల దగ్గరినుంచి తమ జీవితాన్నీ తామే నిర్ణయించుకునే ఆలోచన వున్న వారి వరకు, అలాగే పేదవాని నుంచి ధనవంతు నీ వరకూ ఎవ్వరూ కూడ మానసిక ఒత్తిడికి, డిప్రెషన్ కి అతీతులు కారు, కానీ ఒక్క క్షణం ఆలోచించి జీవితం విలువని తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించవచ్చు ..
*యువతలో మానసిక ఒత్తిడిని, డిప్రెషన్ నీ దూరం చేసే కొన్ని మార్గాలు :*
- తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చిన్నతనం నుండే పిల్లలకు మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడం వారితో స్నేహపూర్వకంగా మెలగడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం,జీవితం విలువలను బంధాల విలువను తెలియజేయడం.
- సానుకూల ఆలోచనా దృక్పధాన్ని అలవాటు చేయడం...
- పాఠశాల స్థాయి నుండే పిల్లల్లో సమస్యను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం , చదవలలో ఒత్తిడిని దూరం చేసే విధంగా వారిలో నిత్యం ప్రేరణను నింపుడం, భవిష్యత్తుపై ధైర్యాన్ని నింపడం ..
- భావవ్యక్తీకరణను అలవాటు చేయడం, సామాజిక సంబంధాల గురించి అవగాహన కల్పించడం
- సామాజిక మాధ్యమల విషయంలో నియంత్రణ వుండేలా చూసుకోవడం
- ఆరోగ్యకరమైన జివన శైలి నీ అలవాటు చేయడం
- జీవితం విలువని, బంధాల విలువలని తెలియచేయడం
- తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించడం అత్యవసరం.
- క్షణికావేశంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ ఆత్మీయలకు, అయినవారికి జీవితాంతము ఎంత మానసిక వేదనకు గురిచేస్తోందో ఆలోచించు..
-సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం అయితే భూమి అంతా ఎప్పుడో శవాల దిబ్బగా మారేది..
-ఆత్మస్థైర్యం తో జీవించు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించు అనుకున్నది సాధించు..
-యువతే సమాజానికి మూలస్థంభం వారు మానసికంగా ధైర్యంగా వుండేదుకు అందరూ కలిసి పనిచేసి ఆత్మహత్య రహిత భారతాన్ని నిర్మించి దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేయాలి.....
-విచక్షణ కొల్పోకు నిన్ను నమ్ముకున్న వాళ్లకు కన్నీళ్లను మిగిలించకు..
-ఉన్నది ఒక్కటే జీవితం..చిరునవ్వుతో జీవించు అనుకున్నది సాధించు...
---జి. అజయ్ కుమార్
---- కాలమిస్ట్