Drinking Water: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టండి.
• అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.

Drinking Water in Suryapet District: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టండి.
అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.
సూర్యాపేట, రాజముద్ర వెబ్ డెస్క్:
జిల్లాలోని వచ్చే మూడు మసాల్లో ఎక్కడకూడా నీటి ఎద్దడి సమస్యలు రాకుండా పక్కా ప్రణాళికతో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఇమామ్ పేట(Imampet) లోని మిషన్ భగీరద(Mission Bhagiratha) నీటి శుద్ధి 95 ఎం ఎల్ డి కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశయం చేసారు.
నీటి శుద్ధి కేంద్రం పరిధిలోని రెండు మున్సిపాలిటీలు సూర్యాపేట(Suryapet), కోదాడ, అలాగే మండలాలు చిలుకూరు(Chilukuru) కింద (19)గ్రామాలు, కోదాడ(Kodad) కింద (24)గ్రామాలు, అనంతగిరి(Ananthagiri) కింద (24) గ్రామాలు,, మునగాల(Munagala) కింద (32) గ్రామాలు, నడిగూడెం(Nadigudem) కింద (17)గ్రామాలు, పెన్ పహాడ్(Penpahad ) కింద (52) గ్రామాలు అదేవిదంగా సూర్యాపేట పరిధిలోని (15) గ్రామీణ ఆవాసాలు, 4 విలీన ఆవాసాలు లకు మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా వేసవిలో నిరంతరం జరగాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో మిషన్ భగీరథ ఈ ఈ అరుణాకర్ రెడ్డి గ్రిడ్, ఈ ఈ శ్రీనివాస్ రావు ఇంట్రా, డిపిఓ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మిషిన్ భగీరథ డి ఈ రాజేందర్ పాండు తదితరులు పాల్గొన్నారు.