Indian Farmers: రైతన్న ఎందుకీ అరువు.. ఎక్కడికి నీ పరుగు...
Indian Farmers: రైతన్న ఎందుకీ అరువు.. ఎక్కడికి నీ పరుగు...
అనంతపురం, రాజముద్రన్యూస్ :
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం కానీ వ్యవసాయం చేస్తున్న రైతులకు లాభాల కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి. చూసుకున్నట్లయితే గత 15 సంవత్సరాలలో భారత దేశంలో 3,19,598 రైతులు రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఘోరంగా ఉందో అని అర్థం చేసుకోవచ్చు. అందులో తెలుగు రాష్ట్రాల్లోనే 8946 మంది రైతులు రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దపడుతుంది .
విత్తనాలైన అక్షరాలతో ప్రకృతి ఒడిలో పుడమి ఒడిలో స్వేదం విడిచి సేద్యం చేసే రైతుకు చివరికి కన్నీళ్లు మిగలడానికిప్రధాన కారణాలు ఇవి :
అధిక పెట్టుబడులు, అప్పులు:
పంట సాగు కోసం రైతులు చాలా రకాలుగా ఖర్చులను భరించాల్సి వస్తుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, నీటి నిర్వహణ మొదలైనవాన్ని రైతుకు భారమవుతున్నాయి. వీటి ఖర్చులను భరించలేక రైతులు బ్యాంకులు లేదా ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు దిగుబడి సరిగ్గా రాక మార్కెట్లో రేటు సరిగా ఉండక అప్పు తీర్చలేని పరిస్థితులలో రైతులు విపరీత నిర్ణయం తీసుకుంటున్నారు.
మితిమీరన రసాయన ఎరువులు పురుగు మందులు వాడకం:
భూమి సారవంతంగా ఉంటేనే దిగుబడులు బలవంతంగా ఉంటుందని విషయాన్ని మరిచి. అధిక దిగుబడులు కోసం రైతులు విపరీతంగా రసాయన ఎరువులను పురుగుమందులను వాడడం వల్ల భూమిలో ఉన్న మిత్ర సూక్ష్మజీవులు పంటకు ఉపయోగపడే మిత్ర జీవులు చనిపోయి భూమి నిస్సారంగా మారడం భూమిలో ఉండే సహజ పోషకాలు నశించడం వంటివి జరగడం వల్ల భూమి సారం తగ్గి దిగుబడులు తగ్గడం, పంటల్లో రోగనిరోధక శక్తి క్షనిమచడం వంటివి జరుగుతాయి.
* ఈ పంట వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం జరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి.
* నేల రకాలను బట్టి రైతు పంటలను సాగు చేయకపోవడం భూసార పరీక్షలపై రైతులు అవగాహన లేకపోవడం.
* మార్కెట్ డిమాండ్ ను బట్టి రైతు పంటలను సాగు చేయలేకపోవడం వంటివి కూడా రైతులకు వ్యవసాయంలో ఆర్థికంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి.
రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి కొన్ని పరిష్కార మార్గాలు
* భూసార పరీక్షలు చేయించుకునే నేలకు అనువైన పంటలను సాగు చేసి తెలివైన వ్యవసాయం చేయడం.
* జీవన సేంద్రియ ఎరువులు వాడకం భూమి ఉంటేనే రైతులు జీవితాల్లో వెలుగు ఉంటుంది . జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు వాడి నీళ్లలో సారవంతంను పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు.
* సహజ వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా పెట్టుబడులను తగ్గించుకోవడం
* రైతు స్థాయిలోనే విత్తనాలను వేసుకోవడం ద్వారా నాణ్యమైన విత్తనాలను పొందడం.
* సమగ్ర నీటినిర్వాన తక్కువ నీటిలో సాగు చేసి పట్టుదలతో ఆలోచించి, నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంటలకు నీటి కొరతను అధిగమించవచ్చు.
* సామాగ్ర వ్యవసాయం వివిధ రకాల పంటలతో పాటు పశు పోషణ కృషి అనుబంధం ఉపాదాలను నిర్వహించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు.
* మార్కెట్లో డిమాండ్ ఆధారంగా పంటలను సాగు చేయడం
* అంతర పంటలను సాగు చేయడం ప్రధాన పొలంతో పాటు అంతర పంటలను సాగు చేయడం ద్వారా రైతు అధికాయాన్ని పొందవచ్చు.
* ప్రభుత్వాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సంఘాలు రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి అరువు కోసం పరువు తీయకుండా ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతు ఆనందంగా వ్యవసాయం చేయగలిగే పరిస్థితికి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* సారవంతమైన స్వచ్ఛమైన భూమిని భావితరాలకు అందించాలంటే సహజ వ్యవసాయ విధానాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* రైతు చిరునవ్వే దేశ అభివృద్ధికి చిరునామా..!
* రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.