Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
• చిరంజీవితో కలిసి ఎక్స్ పీరియంను ప్రారంభించిన ముఖ్యమంత్రి
Experiam Park:
అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
చిరంజీవి(Chiranjeevi)తో కలిసి ఎక్స్ పీరియంను ప్రారంభించిన ముఖ్యమంత్రి
శంకర్ పల్లి, రాజముద్ర న్యూస్:
ప్రపంచంలోనే అత్యంత ఈకో ఫ్రెండ్లీ(Eco Friendly), అత్యధిక జాతుల మొక్కలు(Plants), వైవిధ్యమున్న శిలలు(Rocks), శిల్పాలు కలిగిన "ఎక్స్ పీరియం"(Experiam) వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (C M Enumula Revanth Reddy), పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి.(Mega Star Chiranjeevi) పాల్గొన్న పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుJupally Krishna Rao), ఎక్స్ పీరియం చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు( Ramadu Ramdev Rao), రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) , చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలె యాదయ్య ( Kale Yadaiah). స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ...
రామ్ దేవ్ రావ్ దేశంలో ఈ ప్రాంతాన్ని ప్రథమంగా ఎంచుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని 85 దేశాల
నుంచి మొక్కలు తెచ్చి, ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. లండన్ కాదు, ప్యారిస్ కాదు మన హైదరాబాద్ కు వన్నె తెచ్చినందుకు, ఆయనకు మరింత శక్తినివ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు. హిమాయత్ నగర్ నుండి వికారాబాద్ వరకు ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు చేయాలని సిఎంను సభా ముఖంగా కోరుతున్నా అని అన్నారు. రాబోయే కాలంలో చాలా మంది పర్యాటకులు ఈ ప్రదేశానికి వచ్చే అవకాశం ఉన్నందున, ఈ రోడ్డును విస్తరించాలని కోరారు.
దేశానికే తలమాణికం ఈ ఎక్స్ పీరియం : మంత్రి జూపల్లి కృష్ణారావు
గడచిన 25 ఏళ్ల నుంచి ఒక కలగని, సుదీర్ఘంగా తపన పడుతూ దీనిని నిజం చేశారు. గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఈ ఎక్స్ పీరియం. దేశానికే కాదు.. ప్రపంచానికి తలమానికం ఈ ఎక్స్ పీరియం అని అన్నారు. అయన మాట్లాడుతూ
హైదరాబాద్ అంటే ఆకాశహార్మ్యాలు, గుడులు, చెరువులతో పాటు ఎక్స్ పీరియం కూడా వచ్చి చేరింది.
తెలంగాణకు ఇది మణిహారం లాంటిదని, హైదరాబాద్ లో గోల్కొండ, చార్మినార్ సరసన చేరడం ఖాయమని తెలిపారు. లైఫ్ చాలా చిన్నది..విలువైంది. ఇలాంటి ప్రకృతి అందాలు చూసి ఆనందించాలన్నారు.
అమెరికాలో వారానికి 2 రోజులు ఆట విడుపు గడుపుతారని, కనీసం సంవత్సరానికి మనం 10,15 రోజులు గడపాలన్నారు. దీనివల్ల మన ఆలోచన విధానం మారుతుందని, ఆహ్లాదం కలుగుతుందన్నారు. యావత్తు రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కూడా చూడదగె విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టిన రామ్ దేవ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.
ఎక్స్ పీరియం అద్భుతం : ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy):