Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

• డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య

On
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

IMG-20250113-WA1798

 భీమదేవరపల్లి జనవరి 13 రాజముద్ర 

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. జాతరలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి సిబ్బంది అందిస్తున్న సేవలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. 18వ తేదీ వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. 36 మంది పారా మెడికల్ సిబ్బందిని మూడు షిఫ్ట్ లలో డ్యూటీలు వేశామన్నారు. అత్యవసర నిమిత్తం108 సర్వీస్ అను అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను కూడా భక్తులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి, అశోక్ రెడ్డి, మౌనిక,వినోద్ కుమార్, రాజేశ్వర్ రెడ్డి, విమల కుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 233
Tags:

About The Author

Related Posts

Latest News

Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* Grampanchayat: Bheema Devarapalli : 'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్*
Gram Panchayat Eections, Bheema Devarapalli:    'స్థానిక ఎన్నికలపై' పై యువత ఫోకస్* - సర్పంచ్ గా పోటీ చేసేందుకు యువత ఆసక్తి  -రిజర్వేషన్ల ఖరారు పై...
Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
Veerabhadra Swamy: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో అగ్ని గుండాలపై నడుస్తున్న భక్తులు
Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..
Kothakonda Jathara: కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి