Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య
• భర్త వైద్య ఖర్చుల కోసం... ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్న భార్య
Shankarpally: భర్త ఆరోగ్యం కోసం భార్య బాసటగా నిలిచిభర్త వైద్య ఖర్చుల కోసం... ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్న భార్య
- దాతల సహాయం కోసం ఎదురు చూపులు
శంకర్ పల్లి, రాజముద్ర న్యూస్:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామానికి చెందిన గొల్లగూడ యాదయ్య(50) తండ్రి హనుమయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం తనకున్న మొత్తం అస్తిని తాకట్టు పెట్టి చూయించుకున్న, పూర్తిగా కోలుకోకపోవడంతో దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే కమ్మెట గ్రామానికి చెందినటువంటి గొల్లగూడ యాదయ్య 2023 మార్చ్ 19వ తేదీన హిమాయత్ నగర్ నుండి కమ్మెట కు బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు అతడిని హాస్పిటల్ కి తరలించగా కోమాలోకి వెళ్లినట్టు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. కుడి చేయి కుడికాలు పక్షవాతానికి గురి కావడంతో తీవ్ర మనోవేదన కు గురయ్యారు. హాస్పిటల్ ఖర్చులకై వైద్యం కొరకు తమకున్న అర ఎకరం పొలం పూర్తిగా అమ్మి ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు హాస్పిటల్లో గడిపి ఇంటికి చేరుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు.
తాను మాట్లాడలేరు,తన పని తాను చేసుకోలేడు, ఇలా గత రెండు సంవత్సరాలుగా అతనితో పాటు కుటుంబం నరకయాతన అనుభవిస్తున్నారు. కుటుంబ పరిస్థితి పూట గడవడమే కష్టంగా మారింది. ఏదైనా పని చేసుకుందామని అతని భార్య అనుకున్న, తనకు నాలుగు ఆపరేషన్స్ కావడం వల్ల తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఒక వైపు భర్త మంచాన పడటంతో కుటుంబ భారం ఇబ్బందిగా మారి తన బిడ్డల చదువు ఆగమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాగైనా దాతలు ఆర్థిక సహాయం చేసి తన భర్త ప్రాణాలు కాపడాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రింద ఇచ్చిన అకౌంట్ కు దాతలు సహాయం చెయ్యాలని ఆమె బరువెక్కిన హృదయంతో వేడుకున్నారు.
A/C no- 141512010001553
IFSC CODE - UBIN0814156
BANK NAME - UNION BANK OF INDIA
CHEVELLA BRANCH
ఫోన్ నంబర్ +91 93905 62808