Be Careful: పిల్లలు.. పతంగులతో పైలం
• చైనా మాంజాతో పొంచి ఉన్న ప్రమాదం : -తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
Be Careful: సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లల్లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు పతంగుల దుకాణాల నిర్వాహకులు ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిస్తున్నారు. మనుషులతో పాటు పక్షులకు చైనా మాంజాతో ప్రమాదం పొంచి ఉంది. భీమదేవరపల్లి మండల కేంద్రాల్లో పతంగుల దుకాణాలు వెలిశాయి. అన్ని ప్రాంతాల్లో పతంగుల సందడి నెలకొంది. చైనా మాంజా వినియోగించకుండా పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పతంగులు ఎగురవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలి.
సాధారణ మాంజానే వాడాలి
పతంగులు ఎగిరేసేందుకు చైనా మాంజా కాకుండా సాదా మాంజానే వాడాలి. సాదా మాంజా తో అంతగా ప్రమాదాలు ఉండవని పక్షులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవని పలువురు సూచిస్తున్నారు. సాధారణ మాంజాలతో పోలిస్తే చైనా మాంజా ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్క చర్కా రు. 300 నుంచి రు.500 వరకు వికయిస్తున్నారు. సాధారణ మాంజాలు అందుబాటు ధరలోనే ఉన్నాయి. ప్రమాదకర మాంజాలు వాడిన, సరఫరా చేసిన వన్యప్రాణి సంరక్షణ చట్టం 1986 కింద జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పక్షులకు ప్రమాదం అని ప్రభుత్వం సింథటిక్ చైనా మాంజాలను నిషేధించింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. *- నండ్రు సాయిబాబు ఎస్ఐ ముల్కనూర్*
-చైనా మాంజాతో పొంచి ఉన్న ప్రమాదం
-తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
-మాంజాతో పక్షులకు ఇబ్బందులే..
విద్యుత్ తీగలతో ప్రమాదం
భవనాలు, పిట్టగోడలు, బాల్కనీలపై నిలబడి పతంగులు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న గల్లీలు భారీ భవన సముదాయాలు, విద్యుత్ తీగలు, సెల్ఫోన్ టవర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేసే సాహసం చేయకూడదు. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలు, చెట్లపై పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలా తీసుకునే ప్రయత్నంలో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్ల వెంట గాలిపటాల కోసం పరుగులు పెట్టనీయద్దు. మాంజా మెడకు బిగుసుక పోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి. దాబాలపై కాకుండా మైదానాల్లో పతంగులు ఎగుర వేయాలి.