Hanamkonda, Bheema Devarapalli: వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు పూర్తి
• హుండీ ఆదాయం రూ. 33,27,222/- ఈవో కిషన్ రావు వెల్లడి
Veerabhadra Swamy Temple, Hanamkonda, Bhima Devarapalli:
వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 33,27,222
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్ :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అనిల్, ఆలయ ఈవో కిషన్ రావు పర్యవేక్షించారు. రూ.36,27,222 నగదు,8 గ్రాముల మిశ్రమ బంగారం,1,900 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది హుండీ ఆదాయం ఎనిమిది లక్షల అదనంగా వచ్చినట్లు తెలిపారు.ఈ సంవత్సరం జనవరి 1 నుంచి జనవరి 28 వరకు ఆలయాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సందర్శించిన భక్తుల పరంగా హుండీ ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో సరస్వతి సేవా సమితి, శ్రీనివాస సేవా సమితి, వెంకటేశ్వర స్వామి సేవ సమితి, గోమాత సేవా సమితి సభ్యులు, మాజి చైర్మన్ పిడిశెట్టి కనకయ్య, మాజీ ఎంపీటీసీ యాటపూలు రాజమణి శ్రీనివాస్, ఆలయ అర్చకులు రాజయ్య, రాంబాబు వినయ్ శర్మ , శ్రీకాంత్, రమేష్, సందీప్, శివకుమార్ ముల్కనూర్ ఏఎస్ఐ సంపత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.