Bheema Devarapalli : భీమదేవరపల్లి మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి
• వంగర ఎస్సై దివ్య
Bheemdevara Pally: భీమదేవరపల్లి మండల ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి ఏమనగా..
భద్రత,రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ సేవలు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయని వంగర ఎస్సై దివ్య తెలిపారు.
భీమదేవరపల్లి, రాజముద్ర వెబ్ డెస్క్:
సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మీ యొక్క సొంత ప్రాంతాలకి ప్రయాణమై వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వంగర ఎస్సై దివ్య పలు సూచనలు తెలిపారు. ఇంట్లో విలువైన ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, అవసరమైతే లాకర్స్ లో ఉంచడం ఉత్తమం అని అన్నారు. ముఖ్యమైన పత్రాలను సెల్ ఫోన్లో కానీ, మెయిల్ ఐడి లో కానీ కాపీ చేసుకోవాలి అని తెలిపారు. ఇంటికి తాళం వేసే క్రమంలో జాగ్రత్తలు వహించుకోవాలి. స్మార్ట్ లాక్స్ వినియోగించడం వల్ల ఇంట్లోకి దొంగలు రావడానికి ఆస్కారం ఉండదన్నారు. సీసీ కెమెరాలు ఉపయోగించుకోవడం కూడా మీ ఇంట్లో దొంగతనం జరగకుండా దోహదపడతాయి అని తెలియ జేశారు.
ప్రయాణమై వెళుతున్నప్పుడు మీ ఒంటిపై ఉన్న ఆభరణాలు స్నాచింగ్ ల ద్వారా అపహరణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మీయొక్క లగేజీ బ్యాగులలో డబ్బులు, విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు దొంగలు మీ యొక్క దృష్టి మళ్లించే పనులు చేస్తారు గమనించి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేస్తూ బస్సులలో, రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో మన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి, కనుక కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు గమనించుకుంటూ ఉండాలి.
ప్రయాణమై ఊరు వెళుతున్నప్పుడు మన ఇంటి చుట్టుపక్కల వాళ్లకి సమాచారం అందించడం మంచిది అని పేర్కొన్నారు. భద్రత,రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ సేవలు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. అయినప్పటికీ ప్రజలు వ్యక్తిగత బాధ్యత వహించడం చాలా అవసరం అని తెలిపారు.