Bheema Devarapalli: స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి
• బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్
స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి
ఘనంగా స్వామి వివేకానంద 162 వ జయంతి వేడుకలు
బీజేపీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్
భీమదేవరపల్లి జనవరి 12 (రాజముద్ర)
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి బిజెపి మండల అధ్యక్షులు శ్రీరాములు శ్రీనివాస్ పూలమాల వేసి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని, భారత దేశ సాంస్కృతిక - చారిత్రక వారసత్వం, వైభవాన్ని ప్రపంచ సర్వమత మహాసభలో చాటి చెప్పారన్నారు. తన ప్రసంగాలతో భారత జాతిని మేల్కొల్పారు. దేశ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు వారికి కర్తవ్యాన్ని బోధించారన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, మూల రాము గౌడ్, అంబీర్ కవిత తీగల రాజు, దొంగల వేణు, రాణాప్రతాప్, పోడేటి బిక్షపతి, బైరి సదానందం, గద్ద రాజేందర్, రఘు, ప్రదీప్ రెడ్డి, లక్కీరెడ్డి మల్లారెడ్డి, కాలేరు వికాస్, గొల్లపల్లి నవీన్, అలుగు భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.