Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా.? కార్డులో మీ పిల్లల పేర్లు లేవా..? అయితే ఇలా చేయండి.
• నేటి నుండి సంబంధిత పత్రాలతో మీసేవ కేంద్రాలలో అప్లై చేసుకోండి
![Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా.? కార్డులో మీ పిల్లల పేర్లు లేవా..? అయితే ఇలా చేయండి.](https://www.rajamudranews.com/media-webp/2025-02/img-20250208-wa0381.jpg)
Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా.? కార్డులో మీ పిల్లల పేర్లు లేవా..? అయితే ఇలా చేయండి.
రాజముద్ర, వెబ్ డెస్క్:
Telangana: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 సంవత్సరాలుగా నూతన రేషన్ కార్డులు(New Ration Cards), కార్డులలో పేర్ల నమోదుకు ప్రజలు ఎదురుచూస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం. తాజాగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY)ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు. గతంలో 6 గ్యారంటీల అమలులో భాగంగా అప్లై చేసుకున్న వారికి నూతన రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. తాజాగా రేషన్ కార్డు లేని వారు, అదేవిధంగా రేషన్ కార్డులలో పేరు లేకున్నా వెంటనే మీకు దగ్గరగా ఉన్నటువంటి మీసేవ కేంద్రాలలో సంబంధిత సర్టిఫికెట్లతో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే ఎమ్మార్వో ఆఫీస్ (MRO Office) నుండి ఆదాయ ధ్రువీకరణ పత్రం, అదేవిధంగా నివాస యోగ్యత పత్రం, సభ్యులందరి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబరు కలిగి ఉన్నట్లయితే వెంటనే మీసేవ కేంద్రాలలో వెళ్లి రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలని తెలిపారు.
అర్హులందరికీ అందుబాటులో రేషన్ కార్డులు:
రేషన్ కార్డులు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది.రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని
కల్పిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని మీసేవ కమిషనర్ ను పౌరసరఫరాల శాఖ కోరింది. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో మార్పులు, చిరునామా మార్పులు, ఇతర వివరాల సవీకరణలను కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా చేసుకునే వెసులుబాటును కల్పించింది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనికి నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డును అందిస్తామని తెలిపింది.