Bheemdevara Pally: పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
• కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య
On
![Bheemdevara Pally: పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ](https://www.rajamudranews.com/media-webp/2025-02/img-20250207-wa0919.jpg)
Bheemdevara Pally: Pochamma Temple
పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
భీమదేవరపల్లి, రాజముద్ర న్యూస్:
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి పురోహితులు రవి శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు గొల్లపల్లి లక్ష్మయ్య గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఎత్తు పెంచడం, ప్రహరీ గోడ నిర్మాణం , భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎదులాపురం తిరుపతి, మంగ రామచంద్రం, దార్న శ్రీనివాస్, అప్పని పద్మ బిక్షపతి, ఎదులాపురం రవి, శనిగరపు సదానందం, జాలి ప్రమోద్ రెడ్డి, బొజ్జపూరి అశోక ముఖర్జీ, గుడికందుల శంకరయ్య, డాక్టర్ సుధాకర్, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Experiam Park, CM Revanth Reddy: అద్భుత కళాఖండంగా ఎక్స్పీరియమ్ పార్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Views: 360
Tags:
About The Author
Related Posts
Latest News
07 Feb 2025 14:38:10
తెలంగాణలో నకిలీ ఉద్యోగుల గందరగోళం - తాజాగా సెక్రటేరియట్ వద్ద నకిలీ తహసిల్దార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజముద్ర, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి...