Telangana, BC Commission: ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్

• బీసీ సర్టిఫికెట్ ప్రాసెస్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన శ్రీనివాస్ రూ.లక్ష తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

On
Telangana, BC Commission: ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్

Telangana BC Commission: 

ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్

 

Also Read:  Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..

బీసీ సర్టిఫికెట్ ప్రాసెస్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన శ్రీనివాస్

రూ.లక్ష తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ACB అధికారులు

 

Also Read:  Kothapally village vehicle Overturned: వాహనం బోల్తా..

బీసీ కమిషన్‌ చైర్మన్‌ ( BC Commission Chairman) నిరంజన్‌(Niranjan) పీఏ గొల్ల శ్రీనివాస్‌(Srinivas) ఏసీబీ వలలో చిక్కాడు.బీసీ సర్టిఫికెట్‌ కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ శుక్రవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచంగా తీసుకున్న డబ్బును ఏసీబీ అధికారులు కెమికల్‌ టెస్ట్‌ ఆధారంగా సీజ్‌ చేశారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి.. నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో(ACB Special Court) హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Also Read:  Peddagattu Jathara: పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధం

ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ (ACB DG Vijay Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గొల్ల శ్రీనివాస్‌.. బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ వద్ద ఔట్‌ సోర్సింగ్‌(Out Sourcing ) పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బీసీ సర్టిఫికెట్‌కు సంబంధించి ఓ బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశాడు. ఫైల్ ప్రాసెసింగ్‌ చేయాలంటే రూ 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు.

Also Read:  Shankarpally: భర్తకు బాసటగా నిలుస్తున్న భార్య

ఇందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.లక్ష ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. చైర్మన్ పీఏ లంచం డిమాండ్‌ చేయడంపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌ సిటీ రేంజ్‌-2 యూనిట్ ఏసీబీ అధికారులు ట్రాప్ స్కెచ్‌ వేశారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌ వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రూ.లక్ష తీసుకున్న వెంటనే శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. రూ.లక్ష, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Views: 18

About The Author

Latest News

Peddagattu Jathara: పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధం Peddagattu Jathara: పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధం
Peddagattu Jathara, Suryapet: తెలంగాణ రాష్ట్రం రెండవ అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సర్వం సిద్ధం చేశారు. అదేవిధంగా పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి...
Indian Farmers: రైతన్న ఎందుకీ అరువు.. ఎక్కడికి నీ పరుగు...
Telangana, BC Commission: ఏసీబీ వలలో బీసీ కమిషన్ చైర్మన్ పీఏ శ్రీనివాస్
Telangana CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి
Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా.?  కార్డులో మీ పిల్లల పేర్లు లేవా..? అయితే ఇలా చేయండి.
Telangana Secretariat: తెలంగాణలో నకిలీ ఉద్యోగుల గందరగోళం 
Bheemdevara Pally: పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ