Telangana CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి
• అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమున్న సీఎం
![Telangana CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి](https://www.rajamudranews.com/media-webp/2025-02/1677523-revanth-reddy-1.webp)
Telangana CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణపై చేతులెత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమున్న సీఎం
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)
హైదరాబాద్, రాజముద్ర వెబ్ డెస్క్:(Rajamudra Webdesk) తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గత సంవత్సరం కాలంగా క్యాబినెట్(Cabinet) విస్తరణ లేకుండా కాలం వెళ్లదీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉండటం గమనార్హం. తెలంగాణలో విద్యాశాఖ(Education), మున్సిపల్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ లు ప్రధానమైనవి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ క్యాబినెట్ విస్తరణ పేరుతో పలుమార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టిన విస్తరణ పై ఎలాంటి కొలిక్కి రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం 18 మంది మంత్రులను నియమించుకోలేని పరిస్థితిలో ఉందన్నట్లు ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అయితే క్యాబినెట్ విస్తరణ కొలిక్కి రాకపోవడానికి కారణం ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం దీనికంతటికి కారణం. గత రెండు రోజుల క్రింద సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), పలువురు ఎంపీలు ఏఐసిసి(AICC) పెద్దలను కలిసి కొలిక్కి తీసుకొద్దామని ఆలోచనలో ఉన్న అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడం సీఎం రేవంత్ రెడ్డి నిరాశ నిష్పరులకు గురికావడం తెలిసిందే. అయితే రెండు రోజులు తెలంగాణలో జరుగుతున్న పలు రాజకీయ అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. ముఖ్యంగా కుల గణన, ఎస్సీల రిజర్వేషన్ పై అసెంబ్లీ ఏర్పాటు చేయడం ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును వారికి వివరించారు. క్యాబినెట్ విస్తరణ పై ఏఐసిసి పెద్దలు ఎప్పుడు స్పందిస్తారు చూడాల్సిందే. ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి సారించి తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ చేయాలని పలువురు కోరుతున్నారు.