Peddagattu Jathara, Suryapet: పెద్దగట్టు జాతర అభివృద్ధికి 60 కోట్లు
• పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Peddagattu Jathara, Suryapet: పెద్దగట్టు జాతర అభివృద్ధికి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy Venkat Reddy )తెలిపారు. ఈ మేరకు బుధవారం దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బిఆర్ ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా ను విస్మరించారు. ఉమ్మడి జిల్లా లో 11చోట్ల బిఆర్ ఎస్ పార్టీ డిపాజిట్ లు కోల్పోయింది.
పెద్దగట్టు అభివృద్ధి కోసం 60 కోట్లు కేటాయించి, ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది
పెద్దగట్టు జాతరకు విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లుఘనస్వాగతం పలికిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు
సూర్యాపేట, రాజముద్ర వెబ్ డెస్క్:
పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయం అభివృద్ధి కి 60 కోట్లు కేటాయించి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు నిర్మాణం తో పాటు గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తామని, నిత్యం వచ్చే భక్తులకు గుడి వద్ద వసతి సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
బిఆర్ ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో కెసిఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ని విస్మరించారని అందుకే 11 అసెంబ్లీ స్థానాలలో బిఆర్ ఎస్ పార్టీ డిపాజిట్ లు కోల్పోయిందని, రెండు పార్లమెంటు స్థానాలలో ఉనికి కోల్పోయిందని, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం లో డబ్బులు పంచి జగదీష్ రెడ్డి కొద్ది మెజారిటీతో విజయం సాధించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బుధవారం నాడు ఆయన ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, వేములవీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి లతో కలిసి దురాజ్ పల్లి లోని పెద్దగట్టు ఆలయాన్ని సందర్శించి స్వామి వారి పూజలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, ఆలయ చైర్మన్ నర్సయ్య యాదవ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా వున్న సమయంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి హయాంలో ఎస్ ఆర్ ఎస్ ఎపి కాలువలు తవ్వారని అన్నారు. ఎస్ ఎల్ బిసి సొరంగం పనులను గత పదేళ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్ ఎల్ బిసి సొరంగం పనులు తిరిగి ప్రారంభించామని అన్నారు.
శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు పూర్తిచేసి ఉమ్మడి నల్గొండ జిల్లా కు కృష్ణా జలాలు తీసుకుని వఛ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి కి పాల్పడినారని, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి, నీరు వదిలే పరిస్థితి లేదని ఆయన అన్నారు.
ఆంధ్రలో నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికి సోనియా గాంధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు కట్టుపడి పనిచేశారని అన్నారు. కల్వకుంట్ల కవిత అధికారంలో వున్న పదేళ్ల కాలంలో ఎప్పుడూ పెద్దగట్టు జాతరకు రాలేదని, ఇప్పుడు వచ్చి స్థిరపడ్డారు పసలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ వుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏళ్ల పాటు అధికారంలో వుంటుందని ఆయన అన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రములో బిజెపికి ఓట్లు గాని సీట్లు గాని వచ్చే పరిస్థితి లేదని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అందరి పండుగలను నిర్వహిస్తామని అన్నారు. జగన్ ఆంద్రకు కృష్ణ జలాలు తీసుకుని పోతుంటె కెసిఆర్ ఏనాడు మాట్లాడలేదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని , జగన్ కు రాచమర్యాదలు చేసింది బిఆర్ ఎస్ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.